యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ : మంత్రి గంగుల
admin March 20, 2023 0 COMMENTS
యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు రైతాంగానికి 1.21 కోట్ల కోట్లను ధాన్యం సేకరణ ద్వారా అందజేశారని చెప్పారు. కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియోటాగింగ్, ట్రాన్స్ పోర్టు, మిల్లర్ల అనుసంధానం, గన్నీలు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు తదితర అన్ని వనరులను సంపూర్ణంగా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లయ్స్ శాఖకు సంబంధించిన సేవలను పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఐవీఆర్ఎస్ నెంబర్ 7997512345ను మంత్రి గంగుల ప్రారంభించారు.
RELATED ARTICLES




