
తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్న వైనం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT



