
ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన మహిళా నేత. ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా చేశారు. 2007లో బెస్ట్ ఎమ్మెల్యేగా ఒడిషా అసెంబ్లీ నుంచి నీలకంఠ్ అవార్డు అందుకున్నరు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్లు 10,86,431 కాగా, ఎన్డీయే ఓట్లు 5,32,351 , వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు 45,550 , బీజేడీ ఓట్లు 31,686 , అన్నాడీఎంకే ఓట్లు 14,940 ఉన్నాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




