
తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వేకువ జాము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి.సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలై.. శీతలగాలులు భారీగా వీస్తాయని పేర్కొన్నారు. చలితీవ్రతకు జనం వణుకుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




