FBH చైర్మన్ వేదకుమార్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటిన పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రొ.శాంతా సిన్హా
admin October 4, 2021 0 COMMENTS
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన చాలెంజ్ సామాజిక సేవకురాలు పద్మశ్రీ,రామన్ మెగాసేసే అవార్డ్ గ్రహీత ప్రొ.శాంతా సిన్హా స్వీకరించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఆమె మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాంత సిన్హా మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రొఫెసర్ శాంతా సిన్హా అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలిపారు .కార్యక్రమం అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ ప్రొఫెసర్ శాంతా సిన్హా కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




