
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు వెల్లడించాడు. పని భారాన్ని తగ్గించుకోవడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. రవిశాస్త్రి, రోహిత్ శర్మతో పాటు జట్టు సభ్యులతో చర్చించిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు. దుబాయ్‌లో జరిగే ఈ ప్రపంచ కప్ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నానని.. పని ఒత్తిడి కారణంగాఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ ట్విటర్ ద్వారా ట్వీట్ చేశాడు.

