
భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో దర్భార్ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన ధన్‌కర్ ఎన్డీయే అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ చేశారు. చెల్లుబాటైన 710 ఓట్లలో 528 ఓట్లు ధన్‌కర్‌కు లభించాయి. మార్గరెట్ అల్వా కు 182 ఓట్లు లభించాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




