
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంటు వేదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ముర్ముకు పోలైన 540 ఓట్ల విలువ సుమారు 3,78,000 ఉంటుంది. ఇక యశ్వంత్‌కు 208 ఓట్ల లెక్క విలువ 1,45,600 ఉంటుంది. ఇవన్నీ పార్లమెంట్ ఓట్లు మాత్రమే. పోలైన ఎంపీల ఓట్లలో 15 ఓట్లు చెల్లకుండా పోవడం గమనార్హం. వీటిని తొలి రౌండ్ ఫలితాలుగా పేర్కొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




