పదో తరగతి ఫలితాలు ..విద్యార్థుల ఉత్తీర్ణతలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానం
admin June 30, 2022 0 COMMENTS
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి. సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మార్కులు తక్కువ వచ్చిన వారు నేటి నుంచి 15 రోజుల్లోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT



