
ఇంటర్మీడియట్ ఫలితాలను మంగళవారం (28వ తేదీన) విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూడాలని ఆమె కోరారు. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




