
రైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసిన సీఎం.. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో నిధులు సర్దుబాటు చేసి రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలి పారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




