
ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం రోజు తన కార్యాలయంలో పరస్పర బదిలీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని 2,558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. విద్యా శాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




