
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది.ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనేజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్‌లో భాగమైన అర్బోర్ డే ఫౌండేషన్ గుర్తించిన ప్రపంచ ట్రీ సిటీల్లో హైదరాబాద్‌కు చోటు దక్కింది. దేశంలో రెండు నగరాలకే చోటు దక్కగా, అందులో హైదరాబాద్ ఒకటిగా ఉండటం విశేషం. గత రెండేళ్లలో దాదాపు 3,50,56,635 మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాలతో పచ్చదనం పెంపొందించడంలో ఉత్తమ ఫలితాలు సాధించిన హైదరాబాద్ నగరానికి వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ ప్రఖ్యాతి దక్కడం గర్వకారణంగా ఉందని అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ప్రపంచ దేశాల్లోని పలు నగరాలు పోటీ పడగా, 21 దేశాల్లో సుమారు 138 నగరాలను మాత్రమే ట్రీ సిటీలుగా ఎంపిక చేశారు. భారత్ నుంచి ముంబై, హైదరాబాద్ ట్రీ సిటీలుగా ఉన్నాయి.
RELATED ARTICLES
LEAVE A COMMENT




