
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి గౌతమ్ తండ్రిని కేటీఆర్ ఓదార్చారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… గౌతమ్‌రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గౌతమ్‌రెడ్డితో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని అన్నారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు గౌతమ్ రెడ్డి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. హైదరాబాదులో ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయనకు చెప్పానని తెలిపారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT

