
తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తామని టీఎస్‌ఆర్‌టీసీ నూతన ఛైర్మన్ బాజిరెడ్డ గోవర్థన్ తెలిపారు. కరోనా కష్టాల నుంచి తేరుకుంటామన్నారు. ప్రస్తుతం రూ.10 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. కష్టపడే తత్వమున్న సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారని చెప్పారు. సంస్థ ఆదాయాన్ని తిరిగి రూ.13 నుంచి 14 కోట్లకు చేరుస్తామన్నారు.నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సిఎం కెసిఆర్‌కు జిల్లా ప్రజల తరపున గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




