
తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. గురువారం నాడు ఢిల్లీ చేరిన కేసీఆర్.. వసంత్ విహార్‌లో ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ భవన్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. మొత్తం 1100 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీ ప్లస్ 3 భవన సముదాయంతో TRS భవన్‌ను నిర్మించనున్నారు. మీటింగ్ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని వసతులుండేలా ఈ భవన నిర్మాణాన్ని డిజైన్ చేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




