
శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు.ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్‌పైకి చేరనున్నది. హైటెక్ సిటీ, నాలెడ్జ్ సెంటర్, ఫెనాన్షియల్ డ్రిస్ట్రిక్ట్‌ల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పుతో 4 వరసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు.ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు. పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్, రోడ్ నెంబర్-45 వంతెన, కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ వంతెన మీదుగా గచ్చిబౌలి సులువుగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




