
మునుగోడు నియోజకవర్గంలో శనివారం జరగబోయే ప్రజాదీవెన సభకు ఆ పార్టీ శ్రేణులుముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




