
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నామని చెప్పారు. 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి కార్మికుడు ఈ పథకానికి అర్హుడుగా ఉంటాడని, దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల రూపాయల బీమా ఇస్తామన్నారు. రాష్ట్రంలోని సుమారు 80వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




