
కరోనాపై ఎడతెగని పోరాటం చేసి విజయం సాధించిన న్యూజిలాండ్( New Zealand )లో ఆరు నెలల తర్వాత స్థానికంగా సంక్రమించిన తొలి కేసు నమోదైంది.ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆ దేశం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ, ఈ కేసును డెల్లా వేరియంట్ గా అనుమానిస్తున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మూడు రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని… ఈ వేరియంట్ వల్ల ఆస్ట్రేలియా పడుతున్న ఇబ్బందులను జెసిండా ఉదహరించారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం వల్లే కరోనాను మనం కట్టడి చేయగలిగామని చెప్పారు. ఫిబ్రవరి 28 తర్వాత న్యూజిలాండ్‌లో నమోదైన తొలి కేసు ఇదే. 50 లక్షల జనాభాలో ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా కేవలం 26 మంది మాత్రమే మరణించారు. న్యూజిలాండ్‌లో ఆక్లండ్ నగరంలోని ఓ 58 ఏళ్ల వ్యక్తిలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు.