
యాదాద్రి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఉత్సవాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. వేద పండితులు, పురోహితులు. అర్చకులు రుత్విక్ యాగ్నిక బృందం పాల్గొని కుంభాభిషేకం ఉత్సవాలు జరిపించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నూతనంగా నిర్మించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT