“మన ఊరు – మన బడి”ప్రోగ్రాం.. కోనాపూర్ లో సొంత ఖర్చులతో పాఠశాల శంకుస్థాపన : మంత్రి కేటీఆర్
admin May 10, 2022 0 COMMENTS
కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నానమ్మ ఊరు అప్పర్ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మమ్మ(అమ్మ సోదరి) ఊరు కూడా లోయర్ మానేరులో మునిగిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. బీబీపేట్‌లో సుభాస్ రెడ్డి పాఠశాల కట్టించినప్పుడు తాను కూడా పోసాన్ పల్లిలో నానమ్మ జ్ఞాపకార్థం బడి కట్టిస్తానని హామీ ఇచ్చాను. అందులో భాగంగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద నానమ్మ, అమ్మమ్మ ఊరిలో బడులు కట్టిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రూ. రెండున్నర కోట్లతో నానమ్మ పేరు మీదు బడిని కడుతున్నానని సభలో పేర్కొన్నారు. నానమ్మది పోసాన్ పల్లి, తాతది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట గ్రామం. తెలంగాణలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోనాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. బీబీపేట్‌కు ఒక జూనియర్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు.ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్, పెన్షన్లు.. పల్లె ప్రకృతి వనాలు .. 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధి 7 ఏళ్ళల్లో చేశామన్నారు.
