May 27, 2025
  • 10:43 am బాలచెలమి గ్రంథాలయ ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా- తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డా. రియాజ్
  • 8:48 am 1908 సెప్టెంబర్ 28 మూసీ వరదలు… చింతచెట్టు 116వ వర్ధంతి- ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్
  • 7:02 am నదులు, జలాశయాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
  • 6:47 am డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ అద్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే
  • 11:51 am తెలంగాణ ప్రాచీన చరిత్రను మలుపు తిప్పే ముడుమాల్‍ నిలువురాళ్లు

1908లో సెప్టెంబర్ 28వ తేదీ లో సంభవించిన వినాశకరమైన మూసీ మహావరదలకు సరిగ్గా 115 యేళ్ళు.ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక విపత్తుగా మిగిలిపోయింది.ఈ విషాదానికి పర్యవసానంగా, నాటి పాలకులు నిపుణులైన ప్రణాళికాకర్తల సహాయంతో పటిష్టమైన వివిధ నగర అభివృద్ధి ప్రణాళికలను, పథకాలను అమలు చేశారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఉద్యానవనంలోని “ప్రాణదాత చింతచెట్టు” 1908 వరదల సమయంలో 150 మందికి పైగా ప్రాణాలనుకాపాడి….మూసీ వరదల ప్రభావంతో ఎన్నో ప్రాణాలకు నివాళిగా స్మారక సమావేశాన్ని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ (FBH) నేతృత్వంలో సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ (CDS), డెక్కన్ హెరిటేజ్ ట్రష్ట్ (DHT), జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ (JBRAC) సహకారంతో నిర్వహించారు.

వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ.. 1908లో మూసీ నది వరదలకు 150 మందికి ఆశ్రయం కల్పించిన చింతచెట్టు చరిత్రను వివరించారు. వరదల అనంతరం హైదరాబాద్ 7వ నిజాం 1914 లో సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (CIB) సంస్థను ఏర్పాటు చేసి నగరాన్ని ఒక లేక్ సిటీ , బాగ్ సిటీ, బై సికిల్ సిటీ, సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ పరంగా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో ఒక ముఖ్య నగరంగా ఎదగడమే ఎజెండాగా ప్రణాళికలను రూపొందించి నగర సుందరీకరణలో నిమగ్నమయ్యారు. ఏ నగరానికైనా మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకం అని హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అమలు విషయంలో కూడా ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించి కాలుష్య రహిత, శబ్దరహిత నగరం, ప్రణాళికాబద్ధమైన రవాణా వ్యవస్థ, వసతులు, డ్రైనేజీ వ్యవస్థ, ఘన వ్యర్థాలను శుద్ధి తదితర ప్రణాళికలను రూపొందించడం వల్ల నగరానికి క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నగరంలోని వారసత్వ చారిత్రక భవనాల రక్షణ, వాటిలోని కనీసం 5 లేదా 6 భవనాలకు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉందని తెలిపారు.

శ్రీ రామ నివాస్ పరాశర్జీ, బాబు గురూజీ అందించిన ‘లావణి’ పాట వినాశకరమైన వరదలను గుర్తు చేసింది. సంఘమిత్ర మాలిక్,Jt.Secretary, FBH చింతచెట్టు, పర్యావరణంపై పాట పాడారు. ఉస్మానియా హాస్పిటల్ సుపెరిటెండెంట్ డాక్టర్ నాగేంద్ర మూసీ నది పరిరక్షణను గుర్తు చేస్తూ, ఈ దిశలో తెలంగాణా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సజ్జన్ సింగ్ ప్రకృతి యొక్క 5 ప్రాథమిక అంశాలైన నీరు, గాలి, భూమి, ఆకాశం, మన సహజ వనరుల ఉనికిని గౌరవించడం మరియు దాని పరిరక్షణకు కృషి చేయడం గురించి ప్రసంగించారు. నయీమ్ ఉల్లా షరీఫ్ గంగా జమునా తహజీబ్ ను గుర్తుచేసారు. 1908లో మరిన్ని చెట్లు ఉంటే మరిన్ని ప్రాణాలను కాపాడేవని ధనుంజయ్ అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యార్థులు, యువతను స్వాగతిస్తూ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ భవిష్యత్ అభివృద్ధి వారిపైనే ఆధారపడి ఉందని, వారి భాగస్వామ్యం చాలా అవసరమన్నారు.

వర్షపు నీటి సంరక్షణ నిపుణుడు సుభాష్ రెడ్డి గారు సందర్శకుల కోసం చింతచెట్టు ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఒక శిలాఫలకాన్ని లిఖించి ప్రవేశ ద్వారం వద్ద ఉంచాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని అభ్యర్థించారు. 1908లో మూసీ వరదల సమయంలో ప్రజల దుస్థితిని వివరిస్తూ విద్యార్థులు పర్యావరణ సమస్యలకు సంబంధించిన పాటలు పాడారు. మూసీ వరదలకు నివాళిగా చింతచెట్టు ను స్మరిస్తూ పాల్గొన్నవారు ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సివిల్ సొసైటీ గ్రూపులు, పర్యావరణవేత్తలు, ఉస్మానియా వైద్య కళాశాల వైద్యులు, APSA, Aman Vedika, Residential Welfare Associations (RAWs),COVA, CHATRI,SRD,Senior Citizen Welfare Association, Deccan Academy, తదితర సంస్థల నుంచి సభ్యులు, జె.బి.ఆర్ ఆర్కిటెక్చర్, (JBRAC) ఇంజనీరింగ్ , ఫార్మసీ, కాలేజ్, ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్, హిమాయత్ నగర్, ఫోకస్ స్కూల్ మరియు పలు పాఠశాలలు కళాశాల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, మీడియా కళాశాలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎఫ్ బీహెచ్ జనరల్ సెక్రెటరీ శోభాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

admin

RELATED ARTICLES
LEAVE A COMMENT